3000 RTC Jobs In Telangana : మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేసినప్పటి నుంచి ఎంతోమంది మహిళలు ప్రయాణం చేశారని అన్నారు. అలాగే త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మహిళాశక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు.
Also Read: కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు!
జేబీఎం సంస్థతో ఒప్పందం..
''ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులను నడపాలన్నదే మా ఆలోచన. కాలుష్యాన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సులు ఒక్కటి కూడా తిరగకుండా ప్లాన్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చాక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ రోజురోజుకి అభివృద్ధి చేస్తున్నామని'' మంత్రి పొన్నం అన్నారు.