దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడా చూసినా గల్లిగల్లీకి వినాయక మండపాలతో, భక్తి పాటలతో శోభిత వాతవరణం నెలకొంది. అయితే సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష
అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు జరిగేలా నిర్వాహకులతో చర్చించామని.. ఇందుకు వాళ్లు అంగీకరించినట్లు తెలిపారు. నగరంలో మొత్తం అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమరు లక్ష వరకు ఉండొచ్చని చెప్పారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనోత్సవం చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు వస్తారని.. వీళ్లను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.