పండగ పూట విషాదాలు.. మొత్తం ఎంతమంది మరణించారంటే? ఓ వైపు దేశవ్యాప్తంగా దివాళీ సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు కొన్ని గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో సరదా, సందడిగా ఉండాల్సిన రోజున కొన్ని కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి. By Seetha Ram 31 Oct 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఓ వైపు దేశవ్యాప్తంగా దివాళీ సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు కొన్ని గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో సరదా, సందడిగా ఉండాల్సిన రోజున కొన్ని కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి. Also Read: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్! గోదావరిలో గల్లంతు తాజాగా హైదరాబాద్‌కు చెందిన చలపతి(25) తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లాడు. అక్కడ తన స్నేహితులంతా కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగారు. అది గమనించిన కొందరు నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడారు. మరో యువకుడు చలపతి గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also read: ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు ఇద్దరు జల సమాధి కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయపాలెం వద్ద ఘోర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తోన్న ఒక కారు అదుపుతప్పి కొండాయపాలెం వద్ద అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఆ కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అందులోనే మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Also Read: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. 100 మంది పోలీసులతో! రైలు ఢీకొని తల్లీకుమార్తె మృతి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో విషాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని తల్లీకుమార్తెలు మృతి చెందారు. తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు శిరీష అనే యువతి కావలి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొట్టింది. దీంతో తల్లీకుమార్తెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని నకిరేకల్‌కు చెందిన న్యాయవాది బొబ్బల నర్సింహారెడ్డి(63), అతని భార్య బొబ్బల సరోజిని(58) దంపతులు హైదరాబాద్‌లోని ఓ శుభకార్యానికి బయల్దేరారు. అక్కడికి వెళ్లి తిరిగి కారులో వస్తున్న క్రమంలో హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై మల్కాపూర్ స్టేజి వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు వీరి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. #crime #accidents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి