రోజు రోజుకు కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. వారివల్ల ఇంటి నుంచి ఆడబిడ్డలను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'
ఏ క్షణంలో ఎలాంటి దారుణం జరుగుతుందో అని భయపడిపోతున్నారు. తాజాగా మరో ఘటన జరిగింది. స్కూల్ విద్యార్థినిని కొందరు దుండగులు అత్యాచారం చేశారు. ఏకంగా స్కూల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే వారిలో ఓ మైనర్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!
స్కూల్లోకి తీసుకెళ్లి దారుణం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్‌లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. కాగా ఈ ఘటన రెండు రోజుల కిందట జరిగింది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!
ఇలాంటి ఘటనే మరొకటి
ఢిల్లీలోని నాన్‌గ్లోయి ప్రాంతానికి చెందిన సోనీ అనే 19 ఏళ్ల అమ్మాయి 21 ఏళ్ల అబ్బాయి ప్రేమలో పడింది. అతడిని ఎంతగానో ప్రేమించింది. అయితే ఆ యువకుడు తన పేరుకు బదులు వేరోక పేరుతో ఆమెతో మెలిగాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు తన ప్రేయసిని గర్భవతిని చేశాడు.
ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!
దీంతో ఆ యువతి తనను పెళ్లి చేసుకోమని అతడితో గొడవ పడేది. తరచూ ఇదే విషయంలో గొడవ పడటంతో ఆ యువకుడు కోపంతో చిర్రెత్తిపోయాడు. దీంతో ఆమెను హత్య చేశాడు. ఆపై తన స్నేహితులతో వేరొక ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. ఇక ఆ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు.