Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్‌ పల్స్‌ - సౌత్‌ఫస్ట్‌ సర్వే ఇదే..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పీపుల్స్‌ పల్స్‌ - సౌత్‌ ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 8-10 సీట్లు, బీఆర్‌కు 3-5, బీజేపీ 2-4, ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు తాజాగా వెల్లడించాయి.

Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
New Update

Peoples Pulse : ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana) లోని పీపుల్స్‌ పల్స్‌(Peoples Pulse) - సౌత్‌ఫస్ట్‌(South First) సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించాయి. తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8-10 సీట్లు, బీఆర్‌కు 3-5, బీజేపీ 2-4, ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.

Also Read : ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన..

మళ్లీ మోదియే ప్రధాని కావాలి

కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 31 శాతం ఓట్లు, బీజేపీకి 23 శాతం, ఇతరులకు6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో 34 శాతం మంది ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీ(Narendra Modi) యే దేశ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ని 23 శాతం, ప్రియాంక గాంధీని 11 శాతం, మమతా బెనర్జీని 10 శాతం, అరవింద్‌ కేజ్రీవాల్‌ని 7 శాతం, ఇతరులను 14 శాతం మంది ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు రిపోర్టులో వెల్లడించింది.

4600 శాంపిల్స్‌తో సర్వే

అయితే కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) కి మహిళల్లో ఎక్కువగా మద్దతు ఉన్నట్లు.. పీపుల్స్‌పల్స్ - సౌత్‌ఫస్ట్‌ సర్వేలో వెల్లడైంది. ఈ రెండు సంస్థలు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు ట్రాక్‌ పోల్‌ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్‌ పోల్‌ సర్వే కోసం.. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4600 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల తేదీలపై ఎలక్షన్‌ కమిషన్(Election Commission) కసరత్తులు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మార్చి 9 తర్వాత.. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.

Also Read : వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కోండా సురేఖ

#telugu-news #2024-lok-sabha-elections #2024-elections #telangana-eletions
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe