TS TET Hall Tickets : టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

తెలంగాణ టెట్ హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/HallticketFront లో జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్‌ 2వరకు టెట్ ఎగ్జామ్ జరగనుంది.

New Update
TS TET Hall Tickets : టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TS TET 2024 : తెలంగాణ(Telangana) లో టెట్ హాల్‌టికెట్లు(TET Hall Tickets) విద్యాశాఖ విడుదల చేసింది. మే 20 నుంచి జూన్‌ 2వరకు టెట్ ఎగ్జామ్(TET Exam) నిర్వహించనుండగా.. వివిధ పరీక్షల వారిగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/HallticketFront లో అధికారులు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ యేడాది మొత్తం టెట్‌ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. టెట్‌ ఫలితాలు జూన్‌ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 7032901383 నంబర్‌ను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://tstet2024.aptonline.in/tstet/HallticketFront

Advertisment
తాజా కథనాలు