TET : టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు!

తెలంగాణ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. గతంలో నాలుగు వందలుండగా ఇప్పుడు వెయి రూపాయలు చేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

TS TET 2024: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన!?
New Update

Revanth Sarkar : తెలంగాణ టెట్(Telangana TET) అభ్యర్థులకు రేవంత్ సర్కార్(Revanth Sarkar) షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ ఫీజు(TET Exam Fees) భారీగా పెంచేసింది. గతేడాది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్వహించిన టెట్‌కు రూ.400 ఫీజు వసూలు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్(Congress Government) ఏకంగా రెండున్నర రెట్లు పెంచింది. దీంతో నిరుద్యోగులు రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.2 వేలు చెల్లించాలి..
ఈ మేరకు టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహింస్తుండగా.. ఒక్కో పేపర్‌కు రూ. 1000 పెంచుతూ విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు పేపర్లకు రూ.2 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. టెట్‌ను మే 20 నుంచి జూన్‌ 3 వరకు 15 రోజులపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులు మరిన్ని విరాల కోసం schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ సంప్రదించాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Barrelakka : బర్రెలక్కకు పెళ్లి.. ఎంగేజ్‌మెంట్ ఫొటో వైరల్.. వరుడు అతనే?

ఉద్యమం చేస్తాం..
ఇదిలావుంటే.. అధిక ఫీజులు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో వస్తే పరీక్ష ఫీజులు ఉండవని చెప్పి, ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా వసూలు చేయటం దారుణమని వాపోతున్నారు. ‘ఇది 4 లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమే. వెంటనే ఫీజు తగ్గించాలి. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తాం. టెట్‌ ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించాలి. లేదంటే ఉద్యమం చేస్తాం’ అంటూ రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చిరిస్తున్నారు.

వారికి వెసులుబాటు..
ఇక ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న టీచర్లకు సైతం టెట్‌ రాసుకునే వెలుసుబాటు కల్పించింది. డీఈడీ అర్హులు టెట్‌ పేపర్‌-1కు అర్హులు. కాగా పేపర్‌-2కు డిగ్రీతోపాటు బీఈడీ తప్పనిసరి ఉండాలి. డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015 లోపు జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 40% ఉంటే చాలు.

#telangana #revanth-sarkar #tet-exam-fee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe