Tenth Hall Tickets: పదో తరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదల తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలైయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. www.bse.telagana.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. By V.J Reddy 07 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tenth Hall Tickets Released: తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలైయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. www.bse.telagana.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5.08 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు తెలంగాణ వ్యాప్తంగా మొతం 2676 సెంటర్లు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి అస్వస్థత పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్... పదవ తరగతి పరీక్షలు రాసె విద్యార్థులకు ముఖ్య గమనిక. బోర్డు పరీక్షలు అయిపోయే వరకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షకు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ట్యాబ్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చైన్ లు వంటివి తీసుకురావడానికి అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందే చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. పరీక్షకు ఆలస్యం అవుతే రాసేందుకు అనుమతి ఉండదు. అలాగే మీ పరీక్ష కేంద్రం ఎక్కడ పడిందో ఒక రోజు ముందే వెళ్లి చూసి రావడం వల్ల మీరు పరీక్ష మొదలైయే రోజు సెంటర్లను వెతుక్కునే పని ఉండదు. నిమిషం ఆలస్యం నిబంధన... ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 9 గంటలు దాటితే పరీక్ష రాసేందుకు విద్యార్థులను అధికారులు అనుమతించే వారు కాదు. ఇంటర్ బోర్డు విధించిన ఈ నిబంధన వల్ల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక పోయిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోయామని నిరాశలో కూరుకుపోయి విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను అధికారాలు పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతి సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిమిషం ఆలస్య నిబంధనను తొలిగించింది. అయితే.. పదవ తరగతి విద్యార్థులకు కూడా నిమిషం ఆలస్యం నిబంధనను తొలిగించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి SSC బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. #10th-exams #tenth-hall-tickets-released #telangana-10th-exams #tenth-class-halltickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి