రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే

తెలంగాణలో విద్యాసంస్థలు మరోసారి సెలవులు ప్రకటించనున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే ఉండటంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు వివిధ పద్ధతుల్లో హాలీడేట్ ఇవ్వనున్నాయి. కొన్ని పాఠశాలలు డిసెంబర్ 22 నుంచి 26 వరకూ 5 రోజులు సెలవులు ఇస్తున్నాయి.

Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!
New Update

School Holidays : తెలంగాణ(Telangana) లో విద్యార్థులకు పలు విద్యాసంస్థలు మరోసారి సెలవులు ప్రకటించనున్నాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 2024కు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలలో క్రిస్మస్(Christmas), బాక్సింగ్ డే సందర్భంగా హాలీడేస్ ప్రకటిస్తున్నాయి.

ఈ మేరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్రంలోని మిషనరీ స్కూల్స్ డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకూ తమ పాఠశాలలకు సెలువులు ఇవ్వనుంది. ఇక మరికొన్ని స్కూల్స్ మాత్రం క్రిస్మస్ డిసెంబర్ 25, బాక్సింగ్ డే డిసెంబర్ 26.. ఈ రెండు రోజులు మాత్రమే సెలవులు ప్రకటించబోతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. డిసెంబర్ 26 మాత్రమే సాధారణ సెలవుగా పేర్కొంది. మొత్తానికి డిసెంబర్ 24 ఆదివారం, డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం రావడంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసుగా రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి : తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్స్.. పూర్తి అర్హతలివే

అలాగే జనవరిలోనూ మరోసారి విద్యాసంస్థలకు సెలవులు రాబోతున్నాయి. మరో అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో కలిపి వరుసగా ఆరు రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే.. 2024 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు ప్రకటించగా.. 25 ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో కొన్ని ఆదివారాలుండటం విశేషం.

#telangana #holidays #schools #school-students #christmas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe