Sarpanch's: రేవంత్ సర్కార్‌కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు

ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Sarpanch's: రేవంత్ సర్కార్‌కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు
New Update

Telangana Sarpanch's: నేటితో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో స్టేకు హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ALSO READ: త్వరలో 15వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సంక్షేమ పథకాలు ఆగిపోతాయి: కిషన్ రెడ్డి

తెలంగాణ సర్పంచుల పదవీకాలం నేటితో ముగుస్తోందని అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి. గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. గ్రామ సభలు లేకుండా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించలేకపోతే ఉన్న సర్పంచులను కొన్నాళ్లు కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో సర్పంచులు లేకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు.

లోక్ సభ ఎన్నికల తరువాతే..?

రాష్ట్రవ్యాప్తంగా 2019లో బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల పదవీ కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. సర్పంచుల వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా రికార్డులు అప్పజెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తే సర్పంచులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. సర్పంచుల స్థానంలో అధికారుల పాలన అందుబాటులోకి వస్తే గ్రామ కార్యదర్శికి, ప్రత్యేక అధికారికి జాయింట్ చెక్ పవర్ ఉంటుందని టాక్. సర్పంచ్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని పలు మండలాల్లో సర్పంచులు ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

#cm-revanth-reddy #telangana-high-court #telangana-sarpanch #sarpanch-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe