దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,913 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. ఫోన్ల చోరీలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ CEIR పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణలో 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్‌లో ఈ పోర్టల్ ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
Also Read: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ‘పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక’గా ఫ్రీ కోచింగ్!
ఈ ఏడాది ఇప్పటివరకు అపహరణకు గురైన 21,193 మొబైళ్లను విజయవంతంగా సేకరించారు. గత 8 రోజుల్లోనే 1000 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం మరో విశేషం. ప్రతిరోజూ కూడా దాదాపు 82 మొబైళ్లను రికవరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఇక చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరి చేయడంలో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర మూడు, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానాల్లో నిలిచాయి.
Also read: కల్వకుర్తిలో సీఎం రేవంత్‌కు నిరసన సెగ.. మహిళల ఆందోళన!