Also Read: రాజధానిపై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..
అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు (BRS) ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ఒక సీటు జాతీయ నేతకు, మరో సీటు రాష్ట్ర నేతకు ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోంది. సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు వెళ్లాలని భావిస్తే తెలంగాణ నుంచి నామినేట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. సోనియాతో పాటు, పార్టీ మాజీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Manik Rao Thackeray)..ప్రస్తుత ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, పవన్ ఖేరా, కన్నయ్య కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మిగిలిన మరో సీటు కోసం రాష్ట్ర నేతల నుంచి తీవ్ర పోటీ ఉంది. రేసులో రేణుకాచౌదరి, వీహెచ్, జానారెడ్డి, చిన్నారెడ్డి, బలరాం నాయక్.. సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకర్ (Addanki Dayakar), సంపత్ కుమార్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.
Also Read: బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు
వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ స్థానాలు ఖాళీ అవడంతో ఈ మూడు సీట్లకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఎన్నిక లేకుండానే కాంగ్రెస్‌కు 2 స్థానాలు కల్పించారు. ఐతే మూడో సీటును కూడా దక్కించుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే, నాలుగో వ్యక్తి బరిలోకి దిగితే మాత్రం ఎన్నికలు అనివార్యం అయ్యే పరిస్థితి ఉంటుంది.