Telangana Politics: కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డిని తీవ్రంగా విమర్శించి పార్టీ మారిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉత్తమ్, రేవంత్ కలిసి పార్టీలో చేర్చుకోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

New Update
Telangana Politics: కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?

Telangana Congress Party: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయం ఒక ఎత్తు.. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో మరో ఎత్తు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు స్థానాలు కూడా గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతలైన జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ఈ జిల్లాకు చెందిన వారే. ఒక్కో నేత రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీని నడిపిస్తుండడంతో వర్గ విభేదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ నల్లగొండ జిల్లాలో.

అయితే.. ఇటీవల నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి పని చేస్తున్నారన్న వాతావరణం వచ్చిన తరుణంలో మరో సారి విభేదాలు బయటకు వచ్చాయి. గతంలో ఎంపీ కోమటిరెడ్డిపై (Komatireddy) తీవ్ర విమర్శలు చేసి పార్టీ మారిన భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ నేత చేరికకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి చక్రం తిప్పారు.

ఇప్పటికే ఈ స్థానం నుంచి ఇద్దరు బీసీ నేతలను కోమటిరెడ్డి ప్రోత్సహిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనూహ్యంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉత్తమ్, రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకురావడం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహంలో భాగమనే తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నుంచి బీఆర్ఎస్ (BRS) టికెట్ ఆశించి భంగపడ్డ మందుల సామేలు కూడా చేరారు. ఆయనకు కూడా టికెట్ విషయంలో కోమటిరెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం కోమటిరెడ్డితో చర్చలు జరిపి.. ఆయన అంగీకరించిన తర్వాతనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. భువనగిరి సీటు విషయంలో జరిగిన ఈ పరిణామంతో ఆయా నేతల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోందని సమాచారం.

ఇది కూడా చదవండి: Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు