కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం..
బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్లానింగ్, ప్రచార కమిటీ కన్వీనర్లకు చీఫ్ కోఆర్డినేటర్గా నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేశారు.