Voter Id: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. మీ ఓటర్ ఐడీని సింపుల్గా డౌన్ లోడ్ చేసుకోండిలా! ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. By Bhoomi 12 Oct 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. 18 సంవత్సరాలు నిండిని ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈసీ పలు సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా ఓటు హక్కున్న వాళ్లంతా ఓటర్ ఐడీ కార్డును నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం. ఇది కూడా చదవండి: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.8 వేల సాయం? భారత ఎన్నికల సంఘం రెండు సంవత్సరాల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకువచ్చింది. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు డిజిటల్ కాపీ ఎలాగైతే డౌన్ లోడ్ చేసుకుంటారో అదే విధంగా ఈ ఓటర్ ఐడీ కార్డును కూడా డౌన్ లోడ్ చేసుకుని మీ స్మార్ట్ ఫోన్ లో భద్రంగా ఉంచుకోవచ్చు. భారత్ లో ప్రస్తుతం 9.8కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరిందరికీ ఈ ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఒకశాతం మంది ఓటర్లు మాత్రమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకుంటున్నారని ఈసీ గతంలో పేర్కొంది. ఇక ఓటర్లు తమ ఐడీ కార్డును http://voterportal.eci.gov.in/ వెబ్ సైట్ లేదంటే https://www.nvsp.in/ నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ లోనూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: బీటెక్ అభ్యర్థులకు 5089 ఉద్యోగాలకు అర్హత.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!! - ముందుగా మీరు http://voterportal.eci.gov.in/ లేదంటే https://www.nvsp.in/ వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి. -మనుపు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. -లాగిన్ అయిన తర్వాత హోం పేజీలోకి వెళ్లి E-EPIC Download పై క్లిక్ చేయండి. - E-EPIC నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు ఎంచుకుని సెర్చ్ చేయాలి. -తర్వాత ఓటీపీ పై క్లిక్ చేయాలి. -ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. -ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తుంది. -తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్ చేయాలి. E-EPIC పై క్లిక్ చేయండి. -పీడీఎఫ్ ఫార్మాట్ లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్ లోడ్ అవుతుంది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రాజస్థాన్ లో 23న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఛత్తీస్ ఘడ్ లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3నే కౌంటింగ్ నిర్వహించనున్నారు. #election-commission-of-india #ts #voter-id #5-state-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి