Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!!
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఆ పార్టీ ఎలాగైన మళ్లీ అధికారంలో రావాలన్న ఉద్దేశ్యంతో సంచలన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతిఒక్కరికీ రూ. 25లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ వంటి 59 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది.