78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ.. పోలీసు, హోంగార్డ్, సివిల్, డిఫెన్స్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పోలీసు పతకాలను బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 1037 మంది సిబ్బందికి ఈ పతకాలను అందజేయనుంది. అయితే ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన వ్యక్తికి రావడం విశేషం. చదువు యాదయ్య అనే హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌ను ప్రకటించారు. ఈ అత్యున్నత రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం.. అందులోను ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయన్ని డీజీపీ డా.జితేందర్ అభినందించి సన్మానించారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్
78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. పోలీసు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పతకాలను బుధవారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన చదువు యాదయ్యకు దక్కింది.
Translate this News: