Telangana: తెలంగాణకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్

78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. పోలీసు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పతకాలను బుధవారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన చదువు యాదయ్యకు దక్కింది.

New Update
Telangana: తెలంగాణకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ.. పోలీసు, హోంగార్డ్, సివిల్, డిఫెన్స్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పోలీసు పతకాలను బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 1037 మంది సిబ్బందికి ఈ పతకాలను అందజేయనుంది. అయితే ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన వ్యక్తికి రావడం విశేషం. చదువు యాదయ్య అనే హెడ్‌ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్‌ను ప్రకటించారు. ఈ అత్యున్నత రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం.. అందులోను ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయన్ని డీజీపీ డా.జితేందర్ అభినందించి సన్మానించారు.

చదువు యాదయ్య ఎవరు ?

తెలంగాణలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్ యాదయ్య 2022లో జరిగిన ఓ చోరీ కేసును ధైర్యంగా ఛేదించారు. ఇషాన్ నిరంజన్‌ నీలంపల్లి, రాహుల్‌ అనే ఇద్దరు దొంగలు.. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుండేవారు. అక్రమ ఆయుధాలు సరఫరా చేశారు. ఈ దొంగలను హెడ్‌కానిస్టేబుల్ యాదయ్య పట్టుకున్నారు. 2022 జులై 25న ఈ ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడుతుండగా.. యాదయ్య సాహసోపేతంగా వీళ్లని పట్టుకున్నారు. దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఛాతిపై పలుమార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావంలో కూడా యాదయ్య ధైర్యంగా తెగించి వాళ్లని పట్టుకున్నారు. గాయాల వల్ల ఆయన 17 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. యాదయ్య ధైర్య సాహసాలకు గాను ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకాన్ని ప్రకటించారు.

Also Read: తెలంగాణలో మరో ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ

తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పతకాలంటే
ఈ ఏడాది మొత్తం 1037 మందికి కేంద్రం పతకాలను ప్రకటించింది. ఇందులో 213 మందికి పోలీస్ మెడల్స్‌ ఫర్ గ్యాలంటరీ, 94 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు అందించనున్నారు. అలాగే 729 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు అందజేయనున్నారు. అయితే పతకాల్లో తెలంగాణ నుంచి 21 మందికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 25 మందికి ఈ పతకాలు దక్కాయి. ఇక తెలంగాణలో ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఏడుగురికి మెడల్‌ ఫర్ గ్యాలంటరీ పతకం అందించనున్నారు. అలాగే ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 11 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలతో సత్కరించనున్నారు. ఇక ఏపీ నుంచి నలుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 19 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు