Eagle Squad : తెలంగాణ పోలీసులు(Telangana Police) అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఇప్పటివరకు ఎవ్వరి దగ్గరా లేని ఆయుధాలను సమకూర్చుకున్నారు. డ్రోన్ అటాక్(Drone Attack) లను ముందే పసిగట్టేందుకు, ఆ డ్రోన్లను కూల్చేందుకు రెండు గ్రద్దల(Eagle Squad) ను తమ టీమ్‌లో చేర్చుకున్నారు. అదేంటీ ఈగల్స్ డ్రోన్లను ఎలా పసిగడతాయని ఆలోచిస్తున్నారా... అదే ఇక్కడున్న స్పెషాలిటీ. రెండు ప్రత్యేకమైన గ్రద్దలకు తెలంగాణ పోలీస్ స్పెషల్ టీమ్ మూడేళ్ళ నుంచి శిక్షణ ఇస్తోంది. ఆకాశంలో ఎగిరే శత్రువుల డ్రోన్లను పసిగట్టేలా.. వాటిని నాశనం చేశాలి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆ రెండు ఈగల్స్ ఇప్పుడు ఈ పనిలో ఆరితేరాయి. ఆకాశంలో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు అటాక్ చేసి కూల్చేస్తున్నాయి.
ఇలాంటివి రెండే చోట్ల ఉన్నాయి..
హైదరాబాద్(Hyderabad) శివార్లలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(IITA)లోని సీనియర్ ఐపిఎస్ అధికారులతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అలాకర్ ఈగల్స్‌ను ప్రత్యేకంగా పరీక్షించి చూశారు. ఇద్దరు నిపుణులు రెండు గ్రద్ధలకు శిక్షణ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. దేశంలో ఇలాంటివి ఎవరి దగ్గరా లేదని తెలిపారు. ప్రపంచంలో కూడా ఇలాంటి డేగలు ఒక్క నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయని చెబుతున్నారు. నెదర్లాండ్స్ తరువాత ఈగల్స్‌కు శిక్షణ ఇచ్చినవారిలో తెలంగాణ పోలీసులు రెండవ స్థానంలో ఉన్నారు.
వీవీఐపీ సందర్శనలు, పబ్లిక్ మీటింగ్స్..
తెలంగాణ పోలీసులు ఈ గ్రద్ధలను వీవీఐపీ సందర్శనలు, పబ్లిక్ మీటింగ్స్ కోసం వాడాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవి రెండు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగనీయకుండా ఆపుతాయని చెబుతున్నారు. ఈ ఈగల్ స్క్వాడ్ అంతర్గత భద్రతా విభాగం(ISW) భాగం కింద పర్యవేక్షించబడతాయి. ఇది తెలంగాణలో VVIP భద్రతను పర్యవేక్షించడానికి నియమించబడిన అత్యంత ప్రత్యేకమైన పోలీసు దళం. జూలై 2020లో తెలంగాణ పోలీసులు ఈగల్ స్క్వాడ్‌తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్ట్ కోసం నిధులు కోరుతూ ఆర్థిక శాఖకు హోం శాఖకు ఏఖ రాయగా...వెంటనే ఆమోదం లభించిందని...అప్పటి నుంచి ఈగల్స్‌కు శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు.
Also Read : Reliance : వయాకామ్‌లో మళ్ళీ 13.01% వాటాను కొన్న రిలయన్స్ ఇండస్ట్రీ