Telangana News: 60 ఏళ్ల తర్వాత ఆ గ్రామస్తుల్లో సంతోషం.. అసలేం జరిగిందో తెలుసా? పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల పరిస్థితి. రెండు గ్రామాలకు చెందిన సుమారు 1000కి పైగా ఎకరాల ఇల్లు, వ్యవసాయ భూములు 1947లో అప్పటి నిజాం ప్రభుత్వం అజామాబాద్ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి సేకరించింది. వారికి పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణం జరగలేదు. నేడు ఆ భూముల పట్టాలను గ్రామస్తులకు అందించనున్నారు మంత్రి కేటీఆర్. By Vijaya Nimma 01 Oct 2023 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి అసలు తమ ఆస్తులు తమకు దక్కుతాయో లేవో అనే అనుమానం.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా ఉండేది ఇప్పటివరకు వారి పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వీరికి యాజమాన్య హక్కులను అందిస్తుండడంతో ఆ పరిస్థితి మారింది. ఈ రోజు ఆ గ్రామస్తుల కళ సాకారమైంది. 60 ఏళ్లుగా గ్రామస్తులు భూములు ఉన్నా.. పట్టా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తమ బాధలు తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. గోదావరిఖనిలో జరిగే సభలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గ్రామస్తులు పట్టాలు అందుకోనున్నారు ఈ గ్రామస్తులు. Your browser does not support the video tag. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల పరిస్థితి. రెండు గ్రామాలకు చెందిన సుమారు 1000కి పైగా ఎకరాల ఇల్లు, వ్యవసాయ భూములు 1947లో అప్పటి నిజాం ప్రభుత్వం అజామాబాద్ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి సేకరించింది. అయితే కనీసం అప్పుడు వీరికి నిజాం ప్రభుత్వం కూడా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇదిగో.. అదిగో అంటూ అక్కడ ఉంటున్నారే గానీ.. విద్యుత్ ప్లాంటు ఏర్పాటు అయింది లేదు. తమ బతుకులు మారడం లేదని గ్రామస్తులు వచ్చిన ప్రభుత్వానికి కల్లా విన్నవిస్తూనే ఉన్నారు. చివరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవ తీసుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. Your browser does not support the video tag. దీనికి సంబంధించి ప్రత్యేక జీవోను జారీ చేసి ఇక్కడున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేపు గోదావరిఖనిలో జరిగే దశాబ్ది ప్రగతి సభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు శాశ్వత పట్టాలు అందుకొనున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో గ్రామస్తుల 60 ఏళ్ల కళ సహాకారం అయిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంటున్నారు. పేరుకు సొంత ఊరే అయినప్పటికీ ఎలాంటి యజమాన్యపు హక్కు లేకపోవడంతో అమ్మడం, కొనడం ఇబ్బందిగా ఉండేదని..అలాగే రైతుబంధు, రైతుబీమా వంటి ఏమీ లేవని ఎంపీటీసి కొలిపాక శరణ్య అంటున్నారు. ప్రస్తుతం పట్టాలు ఇవ్వడం వల్ల తమకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. Your browser does not support the video tag. #telangana #minister-ktr #after-60-years #villagers-are-happy #peddapally #sarkar-pattas-for-kurujkammi-lands మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి