Telangana News: హైదరాబాద్‌ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Telangana News: హైదరాబాద్‌ గురుకులంలో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

దేశ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలతో సందడి సందడిగా మారిది. సోమవారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలోనే కాదు.. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే వినాయక విగ్రహం వద్ద పెట్టిన దీపం అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ లో చోటుచేసుకుంది.

దుప్పటికి మంటలు అంటుకుని..

గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. బయటకు వెళ్తున్న క్రమంలో మంటల్లో చిక్కుకున్న శేరిలింగంపల్లికి చెందిన 8వ తరగతి విద్యార్థి నీరజ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిర్వహించారు.

ముప్పు తప్పింది

అయితే..ఇంత జరుగుతున్న గురుకుల యాజమాన్యం ఏం చేస్తున్నారని..?, పిల్లల దగ్గర అధికారులు ఎందుకు లేదని..? మంటలు అంటుకుని ప్రమాదం జరిగినా..!! అప్పటి వరకు అక్కడ ఎవరూ లేకపోవడంపై పలు అనుమానం వ్యక్తం కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల అధికారులపై మండిపడుతున్నారు. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో తప్పిన ముప్పు తప్పిందని, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకున్నప్పుడే స్పందించి ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రమాదం తప్పేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఘటనపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో ముప్పు తప్పింది.

Advertisment
తాజా కథనాలు