Telangana Government: జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్..

తెలంగాణ నూతన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులను నూతన సచివాలయంలోకి అనుమతించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Telangana Government: జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్..
New Update

Telangana Journalist: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయించింది. నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాదిక్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాయంలో జర్నలిస్టులకు ఎంట్రీ లేదు.

బీఆర్కే భవన్‌లో తాత్కాలిక సెక్రటేరియట్ కొనసాగినప్పుడు, ఆ తర్వాత కొత్త సచివాలయంలో ఓపెన్ అయినప్పుడు కూడా ప్రవేశం లేదు. సచివాలయం బయటే ఒక హాల్‌లో మీడియా పాయింట్‌ను ఇచ్చారు. దీంతో చాలా మంది రిపోర్టర్లు తమకు ఎంట్రీ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినా లైట్ తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే జర్నలిస్టులకు శుభవార్త చెప్పడం గమనార్హం.

Also Read:

రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

‘కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా’ విజయశాంతి ట్వీట్ వైరల్!

#telangana-elections #journalist #telangana-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి