IT Minister Sridar babu: ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. శ్రీధర్‌ బాబు ఏమన్నారంటే..

తెలంగాణ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దుద్దిల్ల శ్రీధర్ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతామని.. రాష్ట్ర యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

New Update

తెలాగాణలో మంత్రులకు కొత్త శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో అన్ని శాఖలు ఒకఎత్తైతే.. ఐటీ శాఖ మరోఎత్తు. గతంలో కేటీఆర్‌ ఐటీశాఖలో చురుకుగా తన బాధ్యతను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఐటీమంత్రి ఎవరు అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐటీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు, దుద్దిల్ల శ్రీధర్‌ బాబు రేసులో ఉన్నట్లు జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే చివరికి అధిష్ఠానం శ్రీదర్‌ బాబునే ఐటీ శాఖ మంత్రిగా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధర్ బాబు మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు.

Also read: కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్‌మెంట్లు ఖాళీ

పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతామని.. రాష్ట్ర యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ విషయంలో కూడా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్రంతో చర్చిస్తామన్నారని తెలిపారు. అలాగే ఫార్మాసిటీ విషయంలో కూడా ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని.. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీలో మంచి చర్చలు జరిగేలా చూస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా శ్రీధర్‌ బాబుకు ఐటీ మంత్రి పదవితో పాటు.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించింది.

Also read: రేపు తిరుపతికి ఉత్తమ్.. ఇప్పటికైనా తీస్తారా గడ్డమ్?

#telangana-news #congress #sridar-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe