TS Ration Card : కొత్త కార్డుల కోసం ఎదురు చూపులేనా!

తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరు గ్యారంటీలు రావాలంటే కచ్చితంగా రేషన్‌ కార్డు ఉండాల్సిందే. దీంతో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూపులు చూస్తున్నాయి.

New Update
TS Ration Card : కొత్త కార్డుల కోసం ఎదురు చూపులేనా!

TS Ration Card : తెలంగాణ(Telangana) లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఆరు గ్యారంటీలను(6 Guarantees) అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Government) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరు గ్యారంటీలు రావాలంటే కచ్చితంగా రేషన్‌ కార్డు(Ration Card) ఉండాల్సిందే. దీంతో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూపులు చూస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకానికి రేషన్‌ కార్డు నిబంధన లేదు. అయితే ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన క్రమంలో ఆ పథకానికి కచ్చితంగా రేషన్‌ కార్డు కావాల్సిందే.

ఇటీవల మరో రెండు గ్యారంటీలు అయినటువంటి గ్యాస్‌ సిలిండర్‌ రూ.500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీల అమలుకు కూడా రేషన్‌ కార్డు ఉండాల్సిందే అని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో అర్హులైన లక్షలాది మంది కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం రేషన్‌ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam Kumar Reddy) ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలకు ప్రకటించడం కానీ , ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారన్న సమాచారం మాత్రం ఇవ్వకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబర్‌ లోనే ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను కోరడంతో సుమారు 1.28 కోట్ల వినతి పత్రాలు వచ్చాయి. వీరిలో రేషన్‌ కార్డుల కోసమే ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రేషన్‌ కార్డు లేకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయడం అంటే రాష్ట్రంలో అర్హులైన వారిక అన్యాయం చేయడమే అవుతుందని వారు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.

మరి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు సకాలంలో స్పందించి అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.

Also Read : భారత్‌ లో 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే మొబైల్ ని చెక్ చేస్తున్నారు!

Advertisment
తాజా కథనాలు