Sridhar Babu: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే జాబ్ క్యాలెండర్ (Telangana Job Calendar) రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 (TG Group 1) పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడు కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi: లోక్‌సభ తొలి సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపీ!
ఇక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే హరీష్ రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. మేము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదు. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశ వర్కర్స్‌ను తొక్కించారని విర్శలు గుప్పించారు.