Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్న తరుణంలో తెలంగాణ(Telangana) వాసులకు వాతావరణశాఖ(Department of Meteorology) ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు(Rains) పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మార్చి 17,18,19,20 లో రాష్ట్రంలో వర్ష సూచన ఉందని తెలిపారు. ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొండ ప్రాంతంలో వాతావరణం మారడం ప్రారంభం అయ్యిందని ఐఎండీ తెలిపింది.
రాబోయే 72 గంటలు కూడా చాలా ముఖ్యమైనవని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మార్చి 16 నుంచి 18 వరకు దేశంలోని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు వర్షాలు పడడంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సమయంలో వర్షాలు పడినా, వడగాళ్లు(Hail) కురిసినా రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారులు వివరించారు.
Also Read : తండ్రీకొడుకుల దారుణ హత్య.. కుమారుడి మృతదేహన్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిందితుడు!