Telangana Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇంటర్ బోర్టు కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24న (బుధవారం) ఉదయం 11 గంటలు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు.
Also Read: వెంకయ్య నాయుడుకు పద్మవిభూషన్‌తో సత్కారం..
ఇదిలాఉండగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 10 నుంచి పేపర్ కరెక్షన్‌ను అధికారులు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నాటికి ఇది పూర్తి కావడంతో.. ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది ఇంటర్ బోర్డ్. మరోవైపు పదో తరగతి ఫలితాలు ఈనెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Results @ https://tsbie.cgg.gov.in/
Also Read: ‘ఫ్యాన్ మూవీ’ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి