Rain Alert : తూర్పు జార్ఖండ్ (East Jharkhand) పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ (Telangana) నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు.
మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
హైదారాబాద్ (Hyderabad) లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి ఉరుములతో కూడిన తేలికపాట నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయి.