High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవే అని హైకోర్టు స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. నేడు తీర్పు వెలువరించింది. By V.J Reddy 14 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana High Court : శంషాబాద్ లోని 181 ఎకరాల భూములు HMDA భూములే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈరోజు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల చొరవతో కేసును హెచ్ఎండిఏ గెలిచింది. తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును తప్పు హైకోర్టు పట్టింది. ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! భూములు హైదరాబాద్(Hyderabad) మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు హైకోర్టు చెందుతాయని స్పష్టం చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండి మా సొంత భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిందని ఫిర్యాదు అందగా.. 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారని HMDA వాదనలు వినిపించింది. సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని HMDA పేర్కొంది. ఏడాది వాదనల తర్వాత హెచ్‌ఎండీఏకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. ALSO READ: విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్ #telangana-news #shamshabad #telangana-high-court #hmda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి