Telnagana: రేవంత్ సర్కార్‌కు ఊరట.. జీవో 33ని సమర్థించిన హైకోర్టు

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రేవంత్ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో 33ను హైకోర్టు సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్దారించుకున్నాకే.. వారి దరఖాస్తులను పరిగణలోని తీసుకోవాలని సూచించింది.

New Update
Telnagana: రేవంత్ సర్కార్‌కు ఊరట.. జీవో 33ని సమర్థించిన హైకోర్టు

విద్యార్థుల స్థానికతపై (జీవో 33) రేవంత్‌ సర్కార్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన ఈ జీవోను న్యాయస్థానం సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్దారించుకున్నాకే.. వారి దరఖాస్తులను పరిగణలోని తీసుకోవాలని సూచించింది. అంటే ఆ విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా? కాదా ? అనేది పరిశీలించాలని చెప్పింది. ఇందుకోసం ప్రస్తుతం గైడ్‌లైన్స్ లేనందున కొత్తగా రూపొందించుకోవచ్చని తెలిపింది. ఈ మార్గదర్శకాలు పాటించాలని కాళోజీ వర్సిటీకి ఆదేశించింది. దీనిప్రకారం అర్హులైన విద్యార్థుల దరఖాస్తునే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

స్థానికతకు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల ద్వారా తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. ఇతరులు ఎవరైనా తెలంగాణలో ఇంటర్, దానికి ముందు రెండేళ్లు తెలంగాణలో చదివితే వారికి స్థానిక కోటా వర్తింపజేయడం అన్యాయమని పిటిషన్‌లో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చివరికి ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థించింది.

Also Read: హైదరాబాద్-విజయవాడ మధ్య జర్నీ చేసే వారికి గుడ్ న్యూస్.. 10 శాతం డిస్కౌంట్!

తెలంగాణ విద్యాలయాల్లో ఉన్నత విద్య ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు పాత పద్ధతినే కొనసాగించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా పదేళ్ల కాలం ముగియడంతో తెలంగాణ స్థానికతను నిర్ధారించాల్సి ఉంది. ఇంటర్‌తో పాటు మెడికల్, ఇంజనీరింగ్,అగ్రికల్చర్, లా ఇలా అన్నింట్లో. అని విద్యాలయాల్లో అడ్మిషన్లకు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌.. విద్యా ప్రవేశాల్లో 95 శాతం రిజర్వేషన్లు తెలంగాణ స్థానికులకు దక్కేలా ఓ విధానాన్ని రూపొందించారు. కానీ 2024 ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది జులై 19న జీవో 33ని తీసుకొచ్చింది.

జీవో 33 ఏం చెబుతోంది

ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్ల కోసం ఇంటర్‌కు ముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికతగా రేవంత్ ప్రభుత్వం జీవో 33లో పేర్కొంది. అంటే 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుందని ఈ జీవో చెబుతోంది. దీనివల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి అన్యాయం జరుగుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఏపీ హాస్టళ్లలో ఉంటారని.. తెలంగాణ బయట ఇంటర్‌ చదివిన విద్యార్థులకు మెడికల్‌ సీట్లలో స్థానికత కోటా వర్తించకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

Also Read: అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మోదీ ప్రభుత్వ మరో యూ

ఇదిలాఉండగా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల కాళోజీ నారాయణ రావు యువివర్సిటీ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడి విద్యా సంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉంది. ఈ ఏడాది ఆ గడువు ముగియడంతో ఈ యూనివర్సిటీ తాజా అడ్మిషన్ల కోసం కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. వీటిల్లో స్థానికతపై నిబంధనల్లో మార్పు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జులై 19న జారీ చేసిన జీవో ప్రకారమే స్థానికతను మార్చినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పలువురు విద్యార్థులు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి కోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థించింది.

Advertisment