Gurukula Jobs : గురుకులాల్లో మిగిలిన పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు

తెలంగాణలో గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.

Gurukula Jobs : గురుకులాల్లో మిగిలిన పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు
New Update

Telangana : తెలంగాణలో గురుకుల(Gurukula Jobs) నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఈ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను అలాగే తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(Telangana Residential Educations Recruitment) కు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని సూచించింది. తర్వాత చేపట్టే విచారణలోగా ప్రతివాదలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.

Also Read : వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ వేట.. రేసులో బాబుమోహన్, బల్కా సుమన్ తో పాటు..!

ఒకేసారి అన్ని ఉద్యోగాలు భర్తీ 

గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామకాల్లో ముందు ఎగువ స్థాయి పోస్టులను, తర్వాత దిగువ స్థాయి పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనివల్ల మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకున్నారు. దీంతో మిగిలిన పోస్టులు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయాయి.

గతంలోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు  

ఇలా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని కొరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పుల్ల కార్తీక్‌ విచారణ చేపట్టారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలితే.. వాటిని తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది హిమాగ్జి కోర్టుకు తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు పిటిషనర్లు వినతిపత్రం కూడా అందజేశారని చెప్పారు. కానీ బోర్టు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

Also Read : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య

మిగిలిన ఖాళీలను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని.. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పుల్ల కార్తీక్‌.. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేశారు.

#telugu-news #gurukula-jobs #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe