Vyooham : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన, ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన 'వ్యూహం'(Vyooham) సినిమా ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్(Sensor Certificate) ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది.
Also Read: “నా కెరీర్ లో మరుపురాని సీరీస్”.. #90’s పై శివాజీ కామెంట్స్
Y.S రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) మరణం తర్వాత జగన్(Jagan) పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా RGV ఈ సినిమాను తెరెకెక్కించారు. RGV 'వ్యూహం' సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విడుదలకు సంబందించిన తేదీలను కూడా గతంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు ఆర్జీవీ. అయితే, లోకేష్ పిటిషన్ వేయడంతో డైరెక్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించినట్లు ఈ సినిమా ఉందని ట్రైలర్ లో స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు RGV ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో, ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. జగన్ కు అనుకూలంగా తీస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని చాలా ఆసక్తిగా పెంచుతుంది.