Telangana high court:ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ మీద తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించడమే కాక ప్రతివాదులు జగన్, సీబీఐకి నోటీసులు పంపాలని చెప్పింది. By Manogna alamuru 08 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాకలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. దీని మీద ఇవాళ కోర్టు విచారణ చేసింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈకేసును విచారించింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపైకూడా ధర్మాసనం విచారణ చేసింది. ఇందులో భాగంగా జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. Also Read:గాజాలో దాడులు ఇజ్రాయెల్‌కు మంచిది కాదు-అమెరికా వాదనల తర్వాత హరి రామ జోగయ్య పిల్ లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పిల్ ను పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెల్పింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతివాదులు జగన్, సీబీఐకి నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. Also Read:చదువుకున్న భార్యల శృంగార వివాదంపై నితీశ్ కుమార్ యూటర్న్.. మళ్లీ ఏమన్నారో తెలుసా? #telangana #high-court #jagan #notices #ap-cm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి