ఆర్జీవీ 'వ్యూహం’కు తెలంగాణ హైకోర్టు షాక్.. సెన్సార్ సర్టిఫికెట్‌ సస్పెండ్‌

రామ్ గోపాల్ వర్మ 'హ్యూహం' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సెంట్రల్ సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్జీవీ 'వ్యూహం’కు తెలంగాణ హైకోర్టు షాక్.. సెన్సార్ సర్టిఫికెట్‌ సస్పెండ్‌
New Update

RGV : రామ్ గోపాల్ వర్మ అప్ కమింగ్ మూవీ 'హ్యూహం'(Vyuham) కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర రాజకీయాల కథ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా టీడీపీ నాయకుడు చంద్రబాబు(Chandrababu), వైసీపీ జగన్(Jagan) మోహన్ రెడ్డి పాత్రలను ప్రధానంగా చూపించారు. అయితే ఇటీవల విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ లో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చూపించారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు.

ఈ మేరకు ఈ సినిమాకు సెంట్రల్ సెన్సార్‌ బోర్డు(Sensor Board) జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా సినిమా రిలీజ్ చేయరాదంటూ రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11కు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. గురువారం ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ నంద రాత్రి 11.30 తర్వాత ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. దీనికి ఒక నేత నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లుందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఘనంగా చూపడం, చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి సృజన పేరుతో తమ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేయడంతోపాటు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో వైసీపీ మంత్రులు వేదికపై కూర్చోవడం దారుణమన్నారు.

ఇది కూడా చదవండి : Ind vs SA: మరో ‘సారీ!’.. మూడో రోజే ముంచేసిన సఫారీలు

అలాగే ఇందులో నేరుగా పేర్లు కూడా పెట్టడం మరీ దారుణమని పేర్కొన్నారు. వ్యక్తి గౌరవ ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఉంటుందంటూ సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. నిర్మాతల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం ట్రయలర్‌ చూసి కోర్టును ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. సెన్సార్‌ బోర్డు తరఫున అదనపు ఏజీ పి.నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ ఒకసారి బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించగా ఛైర్మన్‌ ద్వారా రివిజనల్‌ కమిటీకి సిఫారసు చేసినట్లు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ప్రస్తావనను, కొన్ని పేర్లను తొలగించాలని పేర్కొందన్నారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందని చెప్పారు.

#chandrababu #ram-gopal-varma #rgv-vyuham
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe