Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది.

New Update
Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

గణేశ్‌ నిమజ్జనంపై (Ganesh Nimajjanam 2023) తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ (GHMC) ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది. వీటిలో కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను యాధావిధిగా అమలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గణేశ్ నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు లక్ష మండపాలు ఏర్పాటు చేసినట్లు అంచనా. వీటిలో అత్యధిక శాతం హుస్సేన్ సాగర్ లోని నిమజ్జనం చేయాలని నిర్వాహకులు భావిస్తుంటారు. మరికొన్నింటిని సరూర్ నగర్ చెరువు, మల్కం చెరువుతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే.. హైదరాబాద్ లోని ఏర్పాటు చేసిన అనేక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలన్న సెంటిమెంట్ కూడా చాలా మంది భక్తుల్లో ఉంటుంది. కోర్టు ఆదేశాలతో వారు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Ganesh Chaturthi 2023: విద్యార్థులు గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా సాగర్ నీరు కలుషితం అవుతోందని పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీవోపీ తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి అధికారులు సరైన ఏర్పాట్లు చేయని విషయం హైకోర్టు దృష్టికి వచ్చింది.

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు హుస్సేన్ సాగర్ లో పీవోపీతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని మరో సారి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు పోలీస్ కమిషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ప్రారంభమైన ఈ తరుణంలో కోర్టు ఆదేశాలను అధికారులు ఎలా అమలు చేస్తారన్న అంశంపై భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు