/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-88.jpg)
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అర్హనత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అర్హనత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం కోర్టులో ప్రభుత్వం తరఫు న్యాయవాది జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. జంధ్యాల రవిశంకర్ ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.