గృహలక్ష్మి దరఖాస్తులకు పెరుగుతున్న డిమాండ్‌.. ఆఖరి గడువు ఆగస్టు 10

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం ..సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది. ఈ పథకానికి సర్కార్‌ మార్గదర్శకాలు విడుదల చేయగా ఈ నెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.

New Update
గృహలక్ష్మి దరఖాస్తులకు పెరుగుతున్న డిమాండ్‌.. ఆఖరి గడువు ఆగస్టు 10

Gruha Lakshmi Scheme Telangana:

పెరుగుతున్న ఆదరణ

ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను సీఎం కేసీఆర్‌ (KCR) ఇస్తున్నారు. తాజాగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే వారికి గృహలక్ష్మి పథకం (Gruha Lakshmi Scheme) కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగా దరఖాస్తుల ప్రక్రియ అమలైంది. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం కానున్నది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి నేరుగా సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ దగ్గరి నుంచి ఇండ్ల మంజూరు, బిల్లుల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తారు. అర్హుల జాబితాను చూసి మంత్రి హరీష్‌రావు ఇండ్లు మంజూరు చేస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున 33 వేల ఇండ్లు రానున్నాయి.

వందశాతం రాయితీతో

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అభివృద్ధికి సిద్ధమైంది. సొంత ప్లేస్‌ ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల వరకు ఆర్థికసాయం కోసం.. ఈనెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఈ స్కీంలో ప్రభుత్వం ఆర్థికసాయంగా వందశాతం రాయితీతో అందించనుంది. రాష్ట్రంలోని నియోజకవర్గానికి 3 వేల చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లో కలెక్టర్‌, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ గృహలక్ష్మి అమలు కానుంది. ఈ పథకానికి వారే నోడల్ అధికారులుగా వ్యవహరించి.. మహిళల పేరు మీదే.. ఇంటి బేస్‌మెంట్‌ లెవల్, రూఫ్ లెవల్, పూర్తి ఇలా 3 దశల్లో గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. రేషన్‌ కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులన్న ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ - మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేసింది.

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ

అయితే.. ఈ దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా గృహలక్ష్మి వర్తింపజేస్తారు. ఈ సాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థికసాయం అందిస్తారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులు, సహా ఇతరత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ నెల 10 తేదీ వరకు మీసేవ ద్వారా కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల్లోగా వాటిని పరిశీలించి ఈ నెల 25న లబ్ధిదారుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనున్నంది.

Also Read: మైండ్ బ్లాక్ ఆఫర్: ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.59వేలకే.. రూ.11 వేల భారీ తగ్గింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు