గృహలక్ష్మి దరఖాస్తులకు పెరుగుతున్న డిమాండ్.. ఆఖరి గడువు ఆగస్టు 10
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ..సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది. ఈ పథకానికి సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేయగా ఈ నెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.