Telangana: అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపిస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. 2019 -2020 నుంచి రూ.3,905 కోట్ల విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను ప్రభుత్వానికి సరఫరా చేయడంలో 1532 మంది మిల్లర్లు మోసానికి పాల్పడినట్లు బయటపడింది. By B Aravind 30 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rice Millers Scam: తెలంగాణ అక్రమ మిల్లర్లు పెరిగిపోయారు. రాష్ట్రంలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. పౌరసరఫరా శాఖ మార్గదర్శకాల్లో ఉన్న కొన్ని లూప్‌హోల్స్‌ని అదునుగా భావించిన వీరు.. ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను అందించడంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ కూడా వాళ్లకి ఎలాంటి శిక్షలు పడటం లేదు. అయితే ఇప్పుడు పౌరసరఫరాల శాఖ వాళ్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాళ్లకు సంబంధించిన ప్రాపర్టీ లావాదేవీలను నిషేధించింది. అలాగే వారి స్థిరాస్తులను కూడా రెవెన్యూ రికవరీ (RR) చట్టం కిందకి తీసుకొచ్చాయి. Also Read: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ ఈ అక్రమ రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్ మిల్ల్‌డ్ రైస్ పంపడంతో.. వాళ్ల ప్రాపర్టీ ట్రాన్సక్షన్‌ను వెంటనే ఆపివేయాలని.. ఇటీలవల పౌరసరఫరాల శాఖ ఇటీవలే జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆర్‌ఆర్ చట్టం (RR Law) రావడంతో.. కొంతమంది మిల్లర్లు తమ ఆస్తులను తమ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్ల మీదుగా బదిలీ చేసేందుకు లేదా వారికి అమ్మేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. దీంతో వీళ్లని కట్టడి చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు.. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లను సాయం కొరుతున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఓ మిల్లర్.. ప్రభుత్వానికి రూ.90 కోట్ల విలువైన బియ్యాన్ని అందించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత తన ఆస్తులను విక్రయించేదుకు ప్రయత్నించినట్లు అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖకు కమిషనర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్.. ఇలాంటి అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపించడమే కాకుండా.. కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సేకరణ, పంపిణీ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చాలామంది మిల్లర్లు నిబంధనలకు కట్టుబడి.. ప్రభుత్వానికి సీఎంఆర్ అందిస్తున్నారని.. ఈ విధానంలో తాము పారదర్శకతను తీసుకొచ్చామని చౌహన్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వానికి నష్టం కలిగించే ఎలాంటి మిల్లర్లనైనా వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే 2019 -2020 నుంచి రూ.3,905 కోట్ల విలువైన సీఎంఆర్‌ను ప్రభుత్వానికి సరఫరా చేయడంలో 1532 మంది మిల్లర్లు మోసానికి పాల్పడినట్లు ఓ అధికారి తెలిపారు. కొంతమంది నుంచి రికవరీ చేసినప్పటికీ ప్రభుత్వానికి ఇంకా రూ.2,200 కోట్ల విలువైన సీఎంఆర్ పొందాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి అక్రమ మిల్లర్స్‌పై చర్యలు తీసుకునేందుకే పౌరసరఫరాల శాఖ ఆర్‌ఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గతంలో అక్రమ మిల్లర్లకు సంబంధించి చరాస్తులైన కారు, ట్రాక్టర్ లాంటి వాటినే అటాచ్ చేసే అధికారం పౌరసరఫరాల శాఖకు ఉండేదని.. కానీ ఇప్పుడు ఆర్‌ఆర్ చట్టం కింద చరస్తులతో పాటు స్థిరాస్తులను కూడా అటాచ్ చేసే అధికారం ఉందని వెల్లడించారు. Also Read: ఆర్టీవీపై పనికిమాలిన ఫేక్ ప్రచారాలు.. ఈ అసత్యాల వెనుక ఉన్న చెంచాగాళ్లు ఎవరంటే? #telangana #telugu-news #cmr #rice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి