Warangal : కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌పై రాష్ట్ర సర్కార్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావండంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Warangal : కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం
New Update

VC Prof. Ramesh : కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌పై రాష్ట్ర సర్కార్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పలువురు కేయూ అధ్యాపకులు సైతం రమేశ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వీసీ రమేశ్‌పై విజిలెన్స్‌ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం(State Government) నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం(Burra Venkatesham).. విజిలెన్స్‌ డీజీకి పంపించారు.

Also read: కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యంతర నివేదికపై చర్చ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

#warangal #kakatiya-university #vc-ramesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe