పారాలింపిక్స్ కాంస్య పతాక విజేత, వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదును ప్రకటించింది. అలాగే ఆమె జీవనోపాధి కోసం గ్రూప్ 2 ఉద్యోగాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీప్తి కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెను సీఎం రేవంత్ సన్మానించారు. అలాగే పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సహకాలు ఇవ్వాలని సూచించారు.
Also read: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్
దీప్తి జీవంజితో పాటు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడంపై తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ దీప్తి జీవంజి తెలంగాణ యువతకు, క్రీడాకారులకు ఆదర్శమని.. రేవంత్ ప్రభుత్వం ఆమెను గౌరవించడం భవిష్యత్తు క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు.