బిగ్‌ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్‌ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు

కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు

New Update
బిగ్‌ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్‌ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు

ఓవైపు రాజ్‌భవన్‌ ముట్టడికి టీఎస్‌ఆర్టీసీ నేతలు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో రాజ్‌భవన్‌ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఆర్టీసీ యూనియన్‌ నాయకులను చర్చలకు ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. కాసేపట్లో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మీటింగ్‌ పెట్టనున్నారు. మరోవైపు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆర్టీసీ కార్మికులు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళిసై నుంచి కార్మికులకు పిలుపు వచ్చింది.


నన్ను బాధించింది:
ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనపై గవర్నర్ తమిళిసై ట్వీట్ ద్వారా స్పందించారు. ఆర్టీసీ కార్మికుల నిరసనలు తనను బాధించినట్టు తెలిపారు. కార్మికులకు తానెప్పుడు వ్యతిరేకం కాదని.. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వారిని అండగా నిలిచిన విషయం మరువద్దన్నారు తమిళిసై. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల హక్కులకు ఏ మాత్రం అన్యాయం జరగకూడదనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు తమిళిసై. ఈ ట్వీట్‌కి లింక్‌గా 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఓ న్యూస్‌పేపర్‌లో వచ్చిన వచ్చిన వార్తను క్యాప్షన్‌కి జత చేశారు తమిళిసై.

(this is an updating story)

Advertisment
తాజా కథనాలు