Telangana Aasara Pension: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు (Six Guarantees) చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Party) అడుగు వేస్తోంది. తాజాగా తెలంగాణలోని పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పింఛన్లు (Pensions) పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వృద్ధులు, వితంతువులకు ఇచ్చే రూ.2016 పెన్షన్‌ను రూ.4వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ఆరు గ్యారంటీల దరఖాస్తుకు గడువు పొడిగింపు?
ఏప్రిల్ నుంచే అమలు..?
పెంచిన రూ.4 వేల పెన్షన్‌ను ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024-2025 బడ్జెట్‌లో పెన్షన్ పెంపును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 44లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఏప్రిల్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఇప్పటికే అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసరా పెన్షన్ల పథకాన్ని చేయూతగా మార్చి సామాజిక పెన్షన్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయనుంది.
ఇందిరమ్మ ఇండ్లపై అప్డేట్..
తెలంగాణలో పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం (Indiramma Scheme) ప్లేస్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు.
PMAY కింద తెలంగాణకు ఇళ్లు కేటాయించాలని ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. PMAY నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాష్ట్రప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రజాపాలనకు వస్తున్న దరఖాస్తుల్లో ఇళ్లకు సంబంధించినవే అధికంగా ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ALSO READ: వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?