Group-1 Posts : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చాక ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిషికేషన్(Group-1 Notification) ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి తోడు టీఎస్‌పీసీ ఇప్పటికే 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తా కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించింది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) లీకేజీల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షను ఒక సారి కమిషన్ రద్దు చేయగా.. మరో సారి హైకోర్టు రద్దు చేసింది. దీంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్‌కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా మిగిలి ఉన్న పోస్ట్‌లను కూడా యాడ్ చేయాలని భావిస్తోంది.
Also Read : Mayank Agarwal : విమానంలో క్రికెటర్ మయాంక్‌కు తీవ్ర అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు
ఖాళీ పోస్ట్‌ల వివరాలు పంపాలని ఆర్ధికశాఖ ఆదేశం...
కాంగ్రెస్ ప్రభత్వం హామీకి అనుగుణంగా ఫిబ్రవరి 1కి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయాలి. దీని కోసం ఆర్ధిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు శాఖల్లో ఉన్న గ్రూప్ -1 పోస్ట్‌ల వివరాలను వెంటనే పంపాలని ఆర్ధిక శాఖ అధికారి సీఎస్ కె. రామకృష్ణారావు(CS K Ramakrishna Rao) నిన్న సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా మొత్తం వివరాలను పంపాలని ఆదేశించారు. రెవెన్యూ, హోం, అర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, షెడ్యూల్డ్‌క్యాస్ట్ డెవలప్‌మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్-1 సర్వీస్ పోస్టుల్లో ఖాళీల వివరాలు పంపాలని చెప్పారు.