TG Govt : రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) పై రేవంత్ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు రెడీ చేస్తుంది రేవంత్ సర్కార్ (Revanth Sarkar). ఆగస్టు 15వ తేదీలోపు ఈ రుణమాఫీ క్లోజ్ చేయాలని ప్రభుత్వా అధికారులు భావిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్న సీఎం రేవంత్.. రైతు రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పుకొవచ్చు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తుంది.
ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ పూర్తవుతుందని ఇప్పటికే ఆయన గట్టిగా చెప్పారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని రేవంత్ వెల్లడించారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ (Election Code) ముగియడంతో రుణమాఫీపై అధికారులు, సీఎం ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
జులై మొదటివారంలో రుణమాఫీ మొదలుపెట్టి ఆగస్టు 15 లోగా దశలవారిగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తుంది. మొదట లక్ష రుణమాఫీ, ఆ తర్వాత లక్షన్నర, చివరగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. .అయితే పేద రైతులకు మాత్రమే లబ్ది చేకూరేలా ఈ రుణమాఫీ అమలు కానుందని సమాచారం.
ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు ముందుగానే పేర్కొన్నారు. అదేవిధంగా ఆదాయపు పన్ను చెల్లించే వారిని పూర్తిగా పక్కనపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కోసం అమలు చేస్తున్న మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రధానంగా పరిశీలన చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబాలకే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, అది కూడా కుటుంబంలో ఒక్కరికే వస్తుందని చెబుతున్నారు.
పంట రుణాల జాబితాలను తయారు చేస్తున్న రేవంత్ సర్కార్.. అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ (Congress) సర్కార్ చెబుతుంది.
Also read: చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప..ఖంగుతిన్న కస్టమర్లు!