Rythu Runa Mafi Guidelines: తెలంగాణలో రైతురుణమాఫీపై రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయనుంది. కాగా ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రుణమాఫీపై గైడ్ లైన్స్..
* భూమి ఉన్న ప్రతి రైతుకు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ
* ఒక కుటుంబానికి రూ.2 లక్షలు మాత్రమే మాఫీ
* స్వల్ప కాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపు
* వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపు
* 12-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ
* మధ్యలో రెన్యూవల్ చేసుకున్న రుణమాఫీ వర్తింపు
* అసలు, వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ
* రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ
* రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
* ప్రతి బ్యాంకులో రుణమాఫీకి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్
* రుణమాఫీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు బదిలీ
* 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే...
* ఎక్కువ ఉన్న సొమ్ము బ్యాంకుకు చెల్లిస్తేనే మాఫీకి అర్హత
Also Read: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఐఏఎస్‌ల విచారణ..10 మందికి నోటీసులు!