Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. మార్చి 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కండీసన్లు ఉంటాయని...వాటి కిందకు వచ్చే వారికి ఈ పథకం అమలు అవుతోందని చెబుతోంది. By Manogna alamuru 19 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Free Current Scheme Gruha Jyothi : 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం గృహజ్యోతి(Gruha Jyothi) కి అమలుకు తెలంగాణ(Telangana) గవర్నమెంట్ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అములు చేయాలనుకుంటోంది. అయితే ఈ పథకం అమలుకు కొన్ని నియమాలు పెడుతూ కొత్త ట్విస్ట్‌లు ఇచ్చింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందాలంటే కొన్ని షరుతులు వర్తిస్తాయని చెబుతోంది. కానీ ఉచిత విద్యుత్‌కు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో మాత్రం తెలియడం లేదు. Also Read : Breaking : తెలంగాణ విప్ కు గాయాలు.. కారు బోల్తా ఇవన్నీ ఉండాల్సిందే... గృహజ్యోతి పథకానికి(Gruha Jyothi Scheme) తెలంగాణ ప్రభుత్వం ఈ షరుతులు వస్తాయని చెబుతోంది. అందులో గత ఏడాది వాడిన కరెంట్‌కు 10 శాతం ఉచిత కరెంట్ కింద ఇస్తామని తెలిపింది. దాంతో పాటూ నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితి దాటని వారికే పథకం అమలు వర్తిస్తుందని చెబుతోంది. నెల వినియోగం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు తెల్లరేషన్ కార్డు(White Ration Card) ఉన్నవారే పథకానికి అర్హులు అని కూడా చెబుతోంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింకై ఉండాలని తెలపింది. ఈ నిబంధనలు అన్నీ ఉన్నవారికే గృహజ్యోతిని ఇస్తామని స్పష్టం చేసింది. గృహజ్యోతి లెక్కలు ఇవే... గృహజ్యోతి కోసం ఇప్పటివరకు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డు ఉన్న వారి దరఖాస్తుల సంఖ్య 64 లక్షలుగా ఉంది. మళ్ళీ వీరిలో 34లక్షల 59 వేల 585 మందికి మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని గవర్నమెంట్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక గృహజ్యోతి పథకం అమలుకు రూ.4వేల 164 ఖర్చు అవుతుందని తెలిపారు. Also Read : Gold Rate Review : గత వారంలో దిగివచ్చిన బంగారం.. ఎగసిన వెండి ధరలు.. #telangana #ration-card #gruha-jyothi-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి