Telangana: పోడు చట్టాలను ఉల్లింఘిస్తే కఠినంగా చర్యలు: మంత్రి కొండా సురేఖ

వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు భుముల రక్షణకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు.

Telangana: పోడు చట్టాలను ఉల్లింఘిస్తే కఠినంగా చర్యలు: మంత్రి కొండా సురేఖ
New Update

Minister Konda Surekha: వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యవరణశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా.. అలాగే వారి ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీశాఖ గైడ్‌లెన్స్‌ను పాటిస్తూ పోడు భూముల రక్షణకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పోడు సాగు చేసుకుంటున్న రైతులు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హాని చేయకూడదని.. ఆపై చట్టపరమైన చర్యలకు గురికాకూదని హెచ్చరించారు.

Also Read: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్‌ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు!

శనివారం సెక్రటేరియట్‌లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ కొన్నేళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల పట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని.. వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను ఆక్రమిస్తేనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

#telugu-news #konda-surekha #forest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe