Telangana: 17 ఏళ్లలో జెడ్పీటీసీ టు సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన రాజకీయ ప్రస్థానం..

'సీఎం'.. రాష్ట్రానికి అధినేత. ఈ స్థానం కోసం రాజకీయ హేమాహేమీలు తలపడతారు. కానీ, రేవంత్ రెడ్డి 17 ఏళ్లలోనే జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం పదవినే చేపట్టారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, టీపీసీసీ చీఫ్‌గా, ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్.

New Update
New CM Revanth Reddy: రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం.. అందరికీ ఆహ్వానం.. రేవంత్ సంచలన లేఖ

Revanth Reddy Political Career: తెలంగాణ ఎన్నికల్లో పదేళ్ల పాటు అప్రతీహతంగా అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. అసలు కాంగ్రెస్ పార్టీనే లేదన్న పరిస్థితి నుంచి.. నేడు రాష్ట్రంలో అధికారం చేపట్టే స్థాయికి చేరుకుంది. ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కృషి 200 శాతం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చతికిల పడిపోయి పార్టీకి ఊపిరూది.. అధికార పగ్గాలు చేపట్టేవరకు పార్టీకి లాక్కొచ్చింది ఆయన పోరాట పటిమ. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టాం.. చర్చోపచర్చల అనంతరం రేవంత్‌నే ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. అయితే, రేవంత్ రెడ్డి నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెన్ను చూపకుండా.. వెనడకుడు వేయకుండా.. అన్ని సమస్యలనూ ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏంటి? ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? ఓసారి చూద్దాం..

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

విద్యార్థి దశ నుంచే రేవంత్ రెడ్డి రాజకీయాలపై ఎంతో ఆసక్తి కనబరిచేశారు. గ్రాడ్యూయేషన్ స్థాయిలో ఏబీవీపీ నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. నేడు టీపీసీసీ చీఫ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి.. సీఎం రేసులో ముందున్నారు. దీనికంటే ముందుగా రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని టీఆర్ఎస్ కార్యకర్తగా ప్రారంభించారు. 2004లో టీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు రేవంత్. కేసీఆర్ కూడా రేవంత్‌కు ఆ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, నాడు కాంగ్రెస్‌తో పొత్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డికి ఆ సీటు దక్కలేదు. ఆ తరువాత 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో బీఆర్ఎస్(నాడు టీఆర్ఎస్)ను వీడారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తవారుత 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రేవంత్.

రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలుపొందడంతో రేవంత్ రెడ్డి పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఆ తరువాత రేవంత్ రెడ్డిని పిలిపించుకుని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. దాంతో ఆయన టీడీపీలో చేరారు. అప్పటి నుంచి పొలిటికల్‌గా చాలా యాక్టీవ్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రావులపల్లి గుర్నాథరెడ్డిపై ఘన విజయం సాధించారు.

తొలిసారి అసెంబ్లీలో అడుగపెట్టిన రేవంత్ రెడ్డి.. టీడీపీ తరఫున తన వాయిస్‌ను బలంగా వినిపించేవారు. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2014-17 మధ్య కాలంలో టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. అయితే, ఓటుకు కేసు పరిణామాల అనంతరం ఆయన తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఆ తరువాత కొన్నిరోజుల తరువాత అంటే 2017 అక్టోబర్‌లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయనకున్న క్రేజ్‌తో కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే, 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గెలిచారు.

26 జూన్ 2021లో రేవంత్ రెడ్డిని జాతీయ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సీనియర్లతో విభేదాలు.. ఉప ఎన్నికల్లో వరుస ఓటములు.. నేతల తిట్లు.. అన్నింటినీ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా.. అకుంఠిత దీక్షతో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా రాష్ట్ర ప్రజలకు చేరువయ్యేందుకు బస్సు యాత్ర చేపట్టారు రేవంత్. అలా నిత్యం ప్రజలకు టచ్‌లో ఉంటూ.. పార్టీని బలోపేతం చేశారు. నేతల మధ్య సమయన్వయానికి కృషి చేశారు. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. తెలంగాణలో దాని ప్రభావం చూపింది. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పుంజుకుంది. మొత్తంగా నేటి ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read:

Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..

ISRO: ‘ఆదిత్య ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్‌ మీడియాలో ఇస్రో ఫోటో..

Advertisment
తాజా కథనాలు