Sharmila Helps Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy) పెద్ద సాయమే చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila). కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎవరూ అడ్డు రాకుండా ఉండేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇంతకీ రేవంత్ కోసం ఆమె చేసిన సాయం ఏంటి? ఆ సాయం టీపీసీసీ చీఫ్‌కు ఎలా ఉపకరిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తుంది. 10వ తేదీతో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. దాంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాన పార్టీల నేతలు, రెబల్స్, చిన్నా చితకా పార్టీల నేతలు సైతం నామినేషన్స్ వేస్తున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ అధినేత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు నీలం సుధాకర్ తాను సైతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. కానీ, ఆయన నిర్ణయానికి ఆదిలోనే బ్రేక్ పడింది.
కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తుండటంతో.. సుధాకర్ పోటీ విషయం తెలుసుకున్న వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. నీలం సుధాకర్‌ను హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు షర్మిల. పోటీ నుంచి విరమించుకోవాలని సుధాకర్‌కు సూచించారు షర్మిల. తదుపరి ఎన్నికల్లో మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. దాంతో నీలం సుధాకర్ పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సుధాకర్. 'పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తాను. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తాను.' అని ప్రకటించారు నీలం సుధాకర్.
Also Read:
కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!
మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు..